తుగ్గలిన్యూస్ వెలుగు: 

మండల కేంద్రమైన తుగ్గలి నందు సర్పంచ్ రవి, సర్పంచ్ గౌరవ సలహాదారులు తుగ్గలి నాగేంద్ర మరియు పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ఆదేశాల మేరకు పారిశుద్ధ కార్మికులు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా ప్రజల నుండి చెత్తను స్వీకరిస్తున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ గౌరవ సలహాదారుడు తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పారిశుద్ధ పనులను నిర్వహించి, గ్రామాలలో ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా ట్రాక్టర్ ద్వారా చెత్తను పారిశుద్ధ కార్మికుల ద్వారా తొలగిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రభుత్వం అందజేసిన తడి చెత్త,పొడి చెత్త టబ్బులను వినియోగించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలియజేశారు. పారిశుద్ధ కార్మికులకు గత ఆరు నెలల నుండి పెండింగ్ లో ఉన్న జీతాలను తమకు మంజూరు చేయాలని పారిశుద్ధ కార్మికులు కోరుచున్నారు.ఈ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులు అంజనయ్య,బెన్ని తదితరులు పాల్గొన్నారు.
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			
				
				
				Thanks for your feedback!