కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి

న్యూస్ వెలుగు డోన్ :  బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  నిర్వహించినట్లు  కాంగ్రెస్ పార్టీ  డోన్  నియోజకవర్గం ఇంచార్జి,  న్యాయవాది డాక్టర్ గార్లపాటి మద్దులేటి స్వామి   ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ముందుగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రం, షాబాద్ జిల్లా, చాంద్వా గ్రామంలో  జన్మించిన జగ్జీవన్ రామ్ బాల్యంనుంచే దేశభక్తిని పుణికిపుచ్చుకొని జాతీయోద్యమమైన స్వాతంత్య్ర  సంగ్రామంలో పాల్గొని ,పరాయి పాలకుల తో పోరాడిన గొప్ప స్వాతంత్య్ర  సమరయోధుడు అని కొనియాడారు. కేంద్రంలో అనేక కీలక శాఖలకు మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, దేశానికి ఉప ప్రధానిగా సేవలు అందించి దేశ సమగ్రతకు, అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన పరిపాలనా దర్శకుడని ఆయన  కొనియాడారు.

జగ్జీవన్ రామ్  9 సార్లు పార్లమెంటు సభ్యుడి,  40 సంవత్సరాలు పార్లమెంటేరియన్ గా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్, అంతేకాదు ఉపప్రధానిగా,వ్యవసాయ శాఖ ,కమ్యూనికేషన్స్ ,తంతి తపాలా, రక్షణ శాఖ,ఇలా ఎన్నో అత్యున్నత మైన పదవులు చేపట్టినా ఏకైక వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు.
బహుజనులకు కుడి కన్ను బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే, ఎడమ కన్ను డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. కేంద్రములో బీజేపీ ఆర్ ఎస్ ఎస్ భావజాలన్నీ అమలు చేస్తూ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నదని,రిజర్వేషన్ లు తీసివేసే కుట్ర జరుగుతున్నదని,దళిత, గిరిజన, బహుజన, మైనారిటీ నాయకులు మేలుకో వాలని అయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డోన్ నియోజకవర్గం ఇంచార్జి & న్యాయవాది డాక్టర్ గార్లపాటి మద్దులేటి స్వామి  డిసిసి ఉపాధ్యక్షులు యు. జనార్దన్,కాంగ్రెస్ పార్టీ జిల్లా స్పోక్స్ పర్సన్ ఏం జయరాం,కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాముడు,కాంగ్రెస్ నాయకులు మద్దిలేటి,సుంకన్న,తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS