
అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సీఎం
న్యూస్ వెలుగు అమరావతి : రాష్ట్రంలో యూరియా సరఫరా పరిస్థితి, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీఎస్ నుంచి జరిపిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉన్నట్లు తెలిపారు. మరో 10 రోజుల్లో 23,592 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఉల్లి ధర క్వింటాలుకు రూ.1200 తగ్గకుండా చూడాలని ఆదేశాలిచ్చారు. కర్నూలు జిల్లా కోడుమూరులో పురుగు మందు డబ్బాతో ఆత్మహత్య డ్రామా ఆడిన వారిపై విచారణ చేస్తున్నామని అధికారులు తెలిపారు. తురకపాలెం గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు.