షోకాజ్ నోటిసు ఇవ్వండి : రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ గంజిమాల దేవి

షోకాజ్ నోటిసు ఇవ్వండి : రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ గంజిమాల దేవి

తుగ్గలి (న్యూస్ వెలుగు) : ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ మెంబర్ గంజిమాల దేవి మంగళవారం  అధికారులతో కలిసి  తుగ్గలి మండలం లోని ఆశ్రమ బాలికల పాఠశాల,గిరిజన బాలుర పాఠశాలల  ను ఆమె  ఆకస్మిఖ తనిఖీ చేశారు. తనిఖిల్లో నాణ్యత  ప్రమాణాలను ప్రిన్సిపాల్ రోజా రాణి, వి రమేష్  లను   అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రుములోని  బెల్లంపై  పురుగులు ఉండటాన్ని గమనించారు.   వేరుసెనగ , కందిపప్పు, చిక్కి నాణ్యత , బియ్యం  వంటి వాటిపై పలు సూచనలు చేశారు.  ప్రభుత్వం  అందిస్తున్న బోజన సదుపాయాలను విద్యార్దులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే మెనూ ప్రకారమే విద్యార్దులకు  అందించాలన్నారు.  ఆశ్రమ బాలికల పాఠశాలలో అనేక సమస్యలను గుర్తించిగా దీనిపై ప్రిన్సిపాల్ రోజా రాణికి షోకాజ్ నోటిసు ఇవ్వాలని సంబందిత అధికారులను ఆదేశించారు. అనంతరం గిరిజన బాలుర పాఠశాలను తనిఖీ చేయగా విద్యార్దులకు మెనూ ప్రకారం ఆహారం అందించలేదని  ప్రిన్సిపాల్ వి. రమేష్ కు   సోకాజ్ నోటిసు  ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి  రాజ రఘు ,జిల్లా మేనేజర్ వెంకటరాముడు , ఫుడ్  సేఫ్టి అధికారి  రాజ గోపాల్, తుగ్గలి తహసిల్దార్ ,  విద్యాశాఖ అధికారులు పాల్గొన్నట్లు వెల్లడించారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!