ఢిల్లీ : వైద్యులపై హింసకు పాల్పడితే గరిష్ఠంగా ఆరు గంటల్లోగా ఇన్స్టిట్యూషనల్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే బాధ్యత ఇన్స్టిట్యూషన్ హెడ్‌కి ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల అధిపతికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అతుల్ గోయెల్ లేఖ రాశారు. ఇటీవల కోల్‌కతాలో ఓ వైద్యురాలి పై హత్య ఘటన, ఈ అంశంపై రెసిడెంట్ వైద్యుల నిరసన నేపథ్యంలో ఈ దిశానిర్దేశం చేశారు. ఇటీవల ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందిపై హింస సర్వసాధారణమైపోయిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి పునరావృత్తం కాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి లేఖలో పేర్కొన్నారు.
ఆరు గంటల్లో కేసు నమోదు : మార్గ దర్శకాలను ఇచ్చిన ప్రభుత్వం
Was this helpful?
Thanks for your feedback!
NEWER POSTషెడ్యూల్డ్ ను విడుదల చేసిన ఎన్నికల సంఘం
OLDER POSTపద్మ అవార్డుల దరఖాస్తుకు పొడగింపు