
జలాశయాల నిర్వహణ పై కీలక సమావేశం నిర్వహించన సీఎం
అమరావతి (న్యూస్ వెలుగు) సెప్టెంబర్ 11 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జలాశయా నిర్వహణ పై కీలక సమావేశం గురువారం నిర్వహించారు. జలాశయాల్లో నీటి నిల్వలు, సాగునీటి నిర్వహణ, నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, భూగర్భ జలాల స్థితిగతులు తదితర అంశాలపై సిఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టుల్లో మొత్తం 1,313 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు వీలుండగా ఇప్పటివరకు 1,031 టీఎంసీల నీటిని నిల్వ చేసినట్లు సిఎం కు వివరించారు. రాష్ట్రంలోని భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి సామర్ధ్యంలో 79 శాతం నీరు నిల్వ ఉంచినట్లు అధికారులు సిఎం కు వివరించారు. ఈ సమీక్షాసమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!