వారి ధైర్య సాహసాలను స్మరించడం మనందరి బాధ్యత: ఉప ముఖ్యమంత్రి

వారి ధైర్య సాహసాలను స్మరించడం మనందరి బాధ్యత: ఉప ముఖ్యమంత్రి

మంగళగిరి  (న్యూస్ వెలుగు ): అడవులను, వన్యప్రాణులను కాపాడే క్రమంలో తమ ప్రాణాలను అర్పించినవారిని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వారి ధైర్య సాహసాలను స్మరించడం మనందరి బాధ్యత. వారి త్యాగం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం. గురువారం  జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. గతంలో ఇచ్చిన హామీ మేరకు అమరవీరుల అటవీ అధికారుల కుటుంబాల సంక్షేమం కోసం రూ. 5 కోట్లు నిధులను కూటమి ప్రభుత్వం జమ చేయడం జరిగింది. దీనికి సహకరించిన  సీఎం కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినట్లు పేర్కొన్నారు. అటవీ రక్షకుల భద్రత కోసం ఆధునిక ఆయుధాలు, రక్షణ సామాగ్రి, కమ్యూనికేషన్ సదుపాయాలు, వాహనాలను అందించడంతోపాటు, అత్యవసర పరిస్థితుల్లో స్వీయరక్షణ, అక్రమ కార్యకలాపాలను ఎదుర్కోవడం, సవాళ్లను అధిగమించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అడవులు మన జాతి సంపద. వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు తెలిపారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS