
సజ్జ పంటను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు
తుగ్గలి (న్యూస్ వెలుగు) : తుగ్గలి మండల పరిధిలోని గల పలు గ్రామాలలో రైతులు కోసిన సజ్జ పంట కల్లాలను తుగ్గలి మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు శుక్రవారం రోజున పరిశీలించారు.ఈ సందర్భంగా పలు గ్రామాలలో పర్యటించి మండల వ్యవసాయ అధికారి రైతులతో మాట్లాడుతూ అధిక వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. రాబోవు రెండు రోజులు వర్షాలు ఉన్నందున ఎవరు సజ్జ పంటను కోయరాదని ఆయన రైతులకు తెలియజేశారు.ప్రస్తుతం సజ్జ పంటను కోసిన రైతులు వర్షానికి తడవకుండా జాగ్రత్త పడాలని ఆయన తెలియజేశారు.అల్పపీడన ప్రభావం తొలగిన తర్వాత వాతావరణ పరిస్థితుల ఆధారంగా సజ్జ పంటను రైతులు కోసుకోవాలని ఆయన తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వం సజ్జ పంటకు గిట్టుబాటు ధర కల్పించిందని రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు,రైతులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
