మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన ముత్యాల తిరుపాల్

మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన ముత్యాల తిరుపాల్

న్యూస్ వెలుగు (కర్నూల్ ):   కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేసిన మాదిగ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి ని  తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముత్యాల తిరుపాల్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కోకనైనర్ రామకుండ వెంకటేశ్వర్లు శుక్రవారం  మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం  సమస్యలపై చర్చించడం జరిగిందని తెలిపారు.  ఉద్యోగుల సమస్యలు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా  సమస్యలను  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి,  సత్వర పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీరాములు తెలిపారు.  ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీరాములు వర్కింగ్ ప్రెసిడెంట్ గల్లెల రాముడు ,కార్యదర్శి వెంకటస్వామి, జిల్లా నాయకులు కరుణాకర్, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముత్యాల తిరుపాల్,  ఎంఆర్పిఎస్ రాష్ట్ర  కో కన్వినర్  రామకుండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!