
వైద్యరంగంలో పెథాలజీ కీలకం
న్యూస్ వెలుగు (కర్నూలు): ఖచ్చితమైన రోగ నిర్ధారణకు సమర్ధవంతమైన చికిత్స ప్రణాళికల లో పెథాలజీ కీలకం” అని కాన్ఫరెన్స్ ల ద్వారా యువ వైద్యులు నూతన మెలకువలు తెలుసు కుంటారని అందుకే వైద్య రంగం లో పరిశోధనలకి ప్రాధాన్యత ఇస్తున్నామని ఇందుకు ప్రత్యేక 10 కోట్లు రూపాయలతో నిధులు కూడా కేటాయిస్తున్నామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పి. చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కర్నూలు మెడికల్ కాలేజీ యందు “ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాథాలజీ అండ్ మైక్రో బయాలజీ” (ఐఎపిఎం) ఆద్వర్యం లో నిర్వహిస్తున్న మూడు రోజుల “ఏపీ పాథ్కాన్ 2025” ను ఉపకులపతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ కు ఐఎపిఎం ప్రెసిడెంట్ డా.నీరజ మైరెడ్డి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపకులపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్వాంటం టెక్నాలజీ వైపు అడుగులు వేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు వైద్య విద్యా రంగం లో నూతన టెక్నాలజీని ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతున్నామని అందుకు అనుగుణంగా పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రతి మెడికల్ కళాశాలలో రీసెర్చ్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా 10 కోట్ల రూపాయలను pg ల రిసెర్చ్ అక్తివిటికి, మెడికల్ టీచర్స్ కి రూ.2 లక్షలు, రు70 లక్షల రూపాయలు యూజీ స్కాలర్షిప్ ల కోసం కేటాయిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డు విసి డా. ఏ.వి కృష్ణమరాజు,ఐఎపిఎం సెక్రటరీ డా. మారుతి, ఐఎపిఎం అబ్జర్వర్ డా.శ్రీనివాసులు, ట్రెజరర్ డా. కుమార్ రాజు, విభాగాదిపతి డా. పివి. రమణ బాబు, వివిధ కళాశాలల అకాలజీ విభాగపు ప్రొఫెసర్లు అసోసియేట్లు రాజు, విభాగాదిపతి డా. పివి. రమణ బాబు, అసోసియేట్ డా .రేవతి వివిధ కళాశాలల అకాలజీ విభాగపు ప్రొఫెసర్లు అసోసియేట్లు, అసిస్టెంట్లు, పీజీలు తదితరులు పాల్గొన్నారు.
