
పార్టీకి ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివి: వైఎస్ జగన్
న్యూస్ వెలుగు అప్డేట్ : అనంతపురం జిల్లా సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీకి ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు.

Was this helpful?
Thanks for your feedback!