రాజధాని పేరుతో వేల కోట్లు అప్పులు: మాజీ మంత్రి అంబటి

రాజధాని పేరుతో వేల కోట్లు అప్పులు: మాజీ మంత్రి అంబటి

అమరావతి (న్యూస్ వెలుగు ): వైసిపి నేత మాజీ మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుపై కీలక ఆరోపణలు చేశారు. మేం రాజధాని అమరావతి కాదని ఎప్పుడూ చెప్పాలేదు. ఈ రోజు లక్ష కోట్ల రూపాయలను అమరావతి కోసం ఖర్చు చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. దీనిలో 52 వేల కోట్ల రూపాయల అప్పు. ఇలా ప్రజాధనంను వృధా చేయడం ఎందుకు? గుంటూరు-విజయవాడ మధ్యలో 500 ఎకరాలు తీసుకుంటే రాజధానికి సరిపోతుందని వైయస్ జగన్ చెప్పారు. కేవలం రూ.5000 కోట్లు ఖర్చు చేస్తే మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పూర్తి చేయవచ్చు. కానీ వాటికి నిధులు ఇవ్వాలంటే కష్టం అంటూ ప్రైవేటు వారికి అప్పగిస్తున్నారు. రాజధాని పేరుతో మాత్రం వేల కోట్లు అప్పులు తెచ్చి పెడుతున్నారు. ఉన్న ప్రాంతాలను రాజధానులుగా ఎంపిక చేసుకుంటారా? లేక రాజధానిని సృష్టిస్తారా? అమరావతి పేరుతో లక్ష ఎకరాలను సేకరిస్తారా? హైకోర్ట్, శాసనసభ, సచివాలయం నిర్మిస్తే, దాని చుట్టూ రాజధాని అభివృద్ది చెందుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో వనరులు లేక ఇబ్బంది పడుతుంటే, లక్షల కోట్లు అప్పుల పాలు చేస్తున్నారు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు

Author

Was this helpful?

Thanks for your feedback!