
భారీ వర్షాలతో కుదేలవుతున్న ఉల్లి, సజ్జ రైతులు
తుగ్గలి (న్యూస్ వెలుగు ): గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉల్లి,సజ్జ పంటలను సాగు చేసిన రైతులు కుదేలవుతున్నారు.సాగుచేసిన పంట చేతికొచ్చిన సమయంలో ఏకధాటిగా వర్షాలు కురవడంతో చేతికొచ్చిన పంటలు నీళ్ల పాలవుతున్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉల్లి పంటకు సరైన ధర లేక పెట్టుబడులు కూడా రావడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సజ్జ పంట కోసి ఆరబోసే సమయంలో వర్షాలు కురవడంతో గింజలు తడిచి మొలకెత్తుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెడితే వాతావరణ మార్పుల వలన చేతికొచ్చిన పంటలు వర్షార్పణం కావడంతో రైతులు ఆత్మహత్యలు వంటి చర్యలకు పాల్పడుతున్నారని పలువురు రైతులు తెలియజేస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కొరకు కృషి చేయాలని రైతులు తెలియజేస్తున్నారు.నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరహారాన్ని అందజేయడం ద్వారా రైతులకు కాస్త ఉపశమనం కలుగుతుందని పలువురు రైతులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా రైతులు పండించిన పంటలకు ఎటువంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు చేయాలని రైతులు తెలియజేస్తున్నారు.