ప్రజల సంతృప్తే ముఖ్యం: సీఎం

ప్రజల సంతృప్తే ముఖ్యం: సీఎం

న్యూస్ వెలుగు అమరావతి: ప్రభుత్వం అందిస్తున్న పౌరసేవలతో పాటు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దానికి అనుగుణంగానే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలని ఆదేశించారు. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్సుపై మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పౌరసేవలు, సంక్షేమ పథకాలపై పబ్లిక్ పర్సెప్షన్‌ను విశ్లేషిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 10.5 శాతం వృద్ధి రేటుకు చేరుకున్నామని అన్నారు. 2029 నాటికి జీఎస్డీపీ రూ.29 లక్షల కోట్లకు చేరే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS