
కీర్తి హై స్కూల్ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి
న్యూస్ వెలుగు కర్నూలు: నగరంలోని స్థానిక వన్ టౌన్ లో గల కీర్తి హై స్కూల్లో యాజమాన్యం నిర్లక్ష్యం వలన గోడకూలి మృతి చెందిన యూకేజీ విద్యార్థి హకీబ్ మృతికి కారణమైన కీర్తి స్కూల్ యాజమాన్యాన్ని అరెస్టు చేసి స్కూలు గుర్తింపును రద్దుచేసి విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్ డిమాండ్ చేశారు.
కర్నూల్ నగరంలో యూకేజీ విద్యార్థి మృతి చెందిన కీర్తి హైస్కూలును రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్,జిల్లా అధ్యక్షులు అశోక్,రాము,ఏపీఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎద్దుపెంట అంజి పరిశీలించారు నాసిరకంగా చేపట్టిన బిల్డింగ్ నిర్మాణాలు పగుల్లు ఏర్పడిన గోడలు కళ్ళ ముందు కనిపిస్తున్న కీర్తి స్కూల్ యాజమాన్యం ఏమాత్రం జాగ్రత్త వహించకుండా నిర్లక్ష్యం చేయడం వలనే నేడు గోడకూలీ విద్యార్థి మృతి చెందినట్లు,ఆరుమంది విద్యార్థులు గాయపడినట్లు వారు నిర్ధారించుకున్నారు అనంతరం కర్నూలు ప్రభుత్వ సరోజన వైద్యశాలలో మృతి చెందిన విద్యార్థి కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని విద్యార్థి మృతికి కారణమైన స్కూల్ యాజమాన్యంను అరెస్టు చేయాలని వేలకువేలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు కనీస సదుపాయాలు లేని స్కూళ్లను గుర్తించి తక్షణమే వాటి గుర్తింపులను రద్దు చేయాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి నాయకులు భరత్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.