జీఎస్టీ పన్నుల పై అవగాహన : కలెక్టర్

జీఎస్టీ పన్నుల పై అవగాహన : కలెక్టర్

కర్నూలు న్యూస్ వెలుగు : జీఎస్టీ పన్నులు గణనీయంగా తగ్గాయని, ప్రజలు ప్రయోజనం పొందండి అని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి విజ్ఞప్తి చేశారు. బుధవారం స్థానిక భగత్ సింగ్ నగర్ లో జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ కరపత్రాలను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసి, జీఎస్టీ పన్నుల తగ్గింపు పై జిల్లా కలెక్టర్ ప్రజలకు అవగాహన కల్పించారు..అనంతరం సి క్యాంప్ రైతు బజార్ లో ప్రజలకు, దుకాణదారులకు జీఎస్టీ పన్నుల తగ్గింపు గురించి వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిత్యావసర సరుకులు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఆరోగ్య సంబంధిత సామాగ్రి, డైరీ & బేకరి ఉత్పత్తులు, స్టేషనరీ, బైక్, కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రైతులకు సంబంధించి ట్రాక్టర్ లు, ఇతర వ్యవసాయ పరికరాలు, తదితర వస్తువులకు గణనీయంగా జీఎస్టీ పన్నులు తగ్గాయని కలెక్టర్ ప్రజలకు కరపత్రాలు అందిస్తూ, అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను భగత్ సింగ్ నగర్ లో ఇంటింటికీ పంపిణీ చేసి, జీఎస్టీ పన్నుల తగ్గింపు వల్ల లభించే ప్రయోజనాలను కలెక్టర్ ప్రజలకు వివరించారు.. నిత్యావసర సరుకుల మీద జీఎస్టీ పన్ను తగ్గించడంతో ప్రతి నెల కుటుంబానికి 1000 రూపాయల వరకు ప్రయోజనం కలుగుతుందన్నారు.. షాపింగ్ కి వెళ్లినపుడు షాప్ వారు వేస్తున్న ధరలను గమనించాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు…రైతు బజార్ లో దుకాణదారులతో మాట్లాడుతూ, పాత ధరలకు వస్తువులను పాత ఎమ్మార్పీ ధరలకు అమ్మకూడదని స్పష్టం చేశారు. అలా అమ్మితే ప్రజలు నిలదీయాలని కలెక్టర్ సూచించారు. జీఎస్టీ పన్ను తగ్గింపు ప్రయోజనాలను గురించి పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని, కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నీరజ, డిఆర్డిఎ పిడి రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు..

Authors

Was this helpful?

Thanks for your feedback!