చేదోడుగా చంద్రన్న ప్రభుత్వం: టీడీపీ నేత డాక్టర్ చంద్ర

చేదోడుగా చంద్రన్న ప్రభుత్వం: టీడీపీ నేత డాక్టర్ చంద్ర

తుగ్గలి (న్యూస్ వెలుగు): కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతుందని టిడిపి నాయకులు డాక్టర్ చంద్ర అన్నారు. శనివారం కూటమి ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమం రామకొండ పంచాయతీలోని ఆర్ఎస్ పండేకల్లులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. వృద్ధులు,  వికలాంగులు, వితంతువులు,  ఒంటరి మహిళలు వంటి పెన్షన్లను ప్రభుత్వం అమలు చేస్తూ వారికి చేదోడుగా నిలుస్తుందని వారు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే పెన్షన్ విధానం పెంపు, స్త్రీ శక్తి పథకం, అన్న క్యాంటీన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పొదుపు సంఘాలకు పావలా వడ్డీ వంటి పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడం జరుగుతుందన్నారు. పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నట్లు వెల్లడించారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS