
ప్రాణం పోసే వైద్యులకు రక్షణ ఎక్కడ ..?
హోళగుంద : ఆగస్ట్ 14న కలకత్తా మెడికల్ విద్యార్థిని పై జరిగిన దారుణ హత్యను ఖండిస్తూ మండల కేంద్రంలోని డాక్టర్లు న్యూటన్,రాధ,వైద్య సిబ్బంది శనివారం నిరసన తెలిపారు. ముందుగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి బస్టాండు వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ విద్యార్థిని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రాణం పోసే వైద్యులకు దేశంలో రక్షణ కరువైందని వారు అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చట్టాలను చేయాలని వైద్యులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Anji Ramu
 Anji Ramu