
మరోమారు డబుల్ ఇంజన్ సర్కారు కు అవకాశం ఇవ్వండి : మంత్రి నారా లోకేష్
పాట్నాలో (న్యూస్ వెలుగు): ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాట్నాలో పర్యటించారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన పర్యటించినట్లు వెల్లడించారు. పాట్నాలో ఎన్నికల ప్రచారం అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొన్నాను. వికసిత్ భారత్ లక్ష్యసాధనలో బీహార్ పాత్ర చాలా కీలకమైంది. బీహార్ సర్వతోముఖాభివృద్ధికి మరోమారు బీహార్ యువత ఎన్.డీ.ఏను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశాను. ఏపీలో 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో వైసీపీకి అవకాశం ఇవ్వడం వల్ల తీవ్రంగా నష్టపోయామన్నారు. అటువంటి పరిస్థితులు బీహార్ లో తెచ్చుకోవద్దని బీహార్ యువతకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. బీహార్ లో మూడు కారణాల వల్ల ఎన్.డీ.ఏ ని గెలిపించాల్సిన అవసరం ఉంది. లీడర్ షిప్ ట్రాక్ రికార్డ్, డబుల్ ఇంజన్ సర్కారు, ప్రభుత్వాల కొనసాగింపు తో డబల్ ఇంజన్ సర్కార్ ఏర్పడాలన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

