
ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఏపీ సచివాలయం (న్యూస్ వెలుగు ): అమరావతి-విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకూ వివిధ జిల్లాలను విశాఖ ఎకనామిక్ రీజియన్‌గా అభివృద్ధి చేసే అంశంపై చర్చ జరిగింది. ఈ జిల్లాల్లోని ఆర్ధిక వ్యవస్థ, రావాల్సిన పెట్టుబడులు, పెరగాల్సిన జీవన ప్రమాణాలు, సాధించాల్సిన సుస్ధిరాభివృద్ధి తదితర అంశాలతో ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ ను రూపకల్పన చేస్తారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.విజయానంద్, ఆర్ధిక, పర్యాటక, పారిశ్రామిక, రవాణా, ఐటీ, మున్సిపల్, వ్యవసాయ, ప్రణాళికా విభాగం ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

