మహిళల రక్షణ పై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్

మహిళల రక్షణ పై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్

త్రిపుర:  గవర్నర్ ఇంద్ర సేనా రెడ్డి సోమవారం  సమాజంలో మహిళల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు.  మహిళలు నిర్భయంగా జీవించడానికి వారికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అగర్తలాలోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన సైనికులకు రాఖీ కార్యక్రమంలో ఆయన  ప్రసంగించారు.  మహిళలపై దారుణమైన దాడులు, వేధింపులు, వివక్ష వార్తలు సర్వసాధారణమైపోతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.  మహిళలు నిర్భయంగా జీవించగలిగే, అభివృద్ధి చెంది, వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకునే సమాజాన్ని సృష్టించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళల రక్షణ బాధ్యత సోదరులపై ఉందని రాఖీ పండుగ సమాజానికి గుర్తు చేస్తుందని గవర్నర్ వ్యాఖ్యానించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS