రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వండి: రైతు సంఘం
న్యూస్ వెలుగు తుగ్గలి : కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా తుగ్గలి మండలంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు నిరసన చేపట్టారు. అయిదేళ్ళ కోసారి మరే ప్రభుత్వాల ఆడాయి ఆదేశాలు అమలు చేసేదెప్పుడు , ఇచ్చిన హామీలు తీర్చేదెన్నడు అంటూ రైతు సంఘం నేతలు అగ్రహించారు. గత ప్రభుత్వం తుగ్గలి మండలాన్ని కరువు మండలం గా ప్రకటించినప్పటికి నష్టపోయిన రైతులకు గత ప్రభుత్వం బొట్టుకుడా జమ చేయకపోవడం రైతులకు కన్నీరునే మిగిలించిందని వారు అన్నారు. మండలంలో సరైన వర్షపాతం నమోదు కాక , బ్యాంకులలో తెచ్చుకున్న ఋణాలకు వడ్డీ కట్టలేక , బార్య పుస్తెలు కుదువ పెట్టి పొలం సాగుచేస్తే నట్టేట ముంచిన నకిలీ విత్తనాలతో రైతు బతుకు సాగేదెట్టా సామి అంటూ.. రైతులు నెలబకారని మండల కార్యదర్శి కొండారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన కరువు నష్టపరిహారాన్ని రైతులకు వెంటనే జమచేయాలని వారు డిమాండ్ చేశారు. అదికారం కోసం లాడయి మాటలు చెప్పిన కూటమి ప్రభుత్వం రైతు సాగుకు ఇస్తామన్న 20 వేల పెట్టుబడి సాయం ఏమమైందని వారు అన్నారు. రబీ పంటలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం అదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని మండల అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. అనంతరం మండల తహశీల్దార్ కి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో కొండారెడ్డి . శ్రీనివాసలులు , శ్రీరాములు , రామాంజినేయులు, శేఖర్ , హనుమప్ప,శ్రీ అంజినయ్య , ఈశ్వరప్ప , లక్ష్మన్న తదితరులు పాల్గొన్నట్లు వెల్లడించారు.