రమణీయం  వీరభద్రేశ్వర స్వామి కుంభోత్సవం

రమణీయం  వీరభద్రేశ్వర స్వామి కుంభోత్సవం

ఆలూరు : హోళగుంద మండల పరిధిలో పెద్దహ్యట గ్రామంలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామికి దేవాలయంల్లో శ్రావణ మాస మూడవ సోమవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.

అలాగే అర్చకులు రాచయ్య స్వామీ ఉదయం నుంచి స్వామివారి సన్నిధిలోజలాభిషేకం,పంచామృతాభిషేకం,బిల్వార్చన,ఆకుపూజ,దేవుడిని పెద్ద ఎత్తున పూలమాలలతో అలంకరించారు.

ముందుగా గ్రామ శివారులో ఉన్న బావికి వెళ్లి గంగా మాతకు విశేష పూజలు నిర్వహించి,అక్కడి నుంచి కుంభోత్సవంతో ఊరేగింపుగా వీరగాసే నృత్యాలు చేస్తూ, అడుగడుగునా అహాహా…రుద్ర….శ్రీ వీరభద్ర అనే స్వామి పవాడలను(వడవులు) చెప్తూ,నదికొలు ఆడిస్తూ,సకల వాయిద్య నడుమ స్వామివారి సన్నిధికి చేరుకున్నారు.ప్రధానంగా శ్రీ వీరభద్రేశ్వర స్వామి వేషధారణ భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమం ఆనవాయితీగా ప్రతి సంవత్సరంలాగేనే ఈ సారి కూడా స్వామివారి కుంభోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.అలాగే భక్తులు అనుకున్న మొక్కుబడులు తీర్చుకున్నారు.మరియు మంచి వర్షాలు కురిసి పాడిపంటలు సుభిక్షంగా పండాలని ప్రార్థించారు.ఆలయానికి వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టూ పక్కల మండలాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Author

Was this helpful?

Thanks for your feedback!