FlatNews Buy Now
జిల్లా గౌరవాధ్యక్షులు కురువ కిష్టన్న సంతాప సభ

జిల్లా గౌరవాధ్యక్షులు కురువ కిష్టన్న సంతాప సభ

కురువ కులస్థులు దాడులపై కార్యచరణ :కర్నూలు జిల్లా కురువ సంఘం

కర్నూలు, న్యూస్​ వేలుగు: కర్నూలు జిల్లా కేంద్రంలోజిల్లాపరిషత్ ఆవరణలో ని ఎంపిపి హాలులో కురువ

కులస్థులు విశ్రాంత తహసిల్దార్ మరియు జిల్లా గౌరవ అధ్యక్షులు కురువ కిష్టన్న సంతాపసభ జరిగింది.మొదట స్వర్గీయ కురువ కిష్టన్న చిత్ర పటానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం సంతాప సభలో కర్నూలు జిల్లా కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కే. రంగస్వామి,, కె. సాయికుమారి జిల్లా కురువ సంఘం మాజీ అధ్యక్షులు గడ్డం రామకృష్ణ మాట్లాడుతూ కురువ కిష్టన్న తాసిల్దారుగా రిటైర్డ్ అయిన తర్వాత బుధవారం పేటలోని కేశవ మెమోరియల్ స్కూల్లో కరస్పాండెంట్ గా విశేష సేవలందించారు,అలాగే విశ్వహిందూ పరిషత్, బజరంగదల్ లో ను సేవలందించారు. కర్నూల్లో కేంద్ర వినాయక మహోత్సవ కమిటీ ఏర్పాటు చేసి కర్నూలు జిల్లా అగ్రభాగాన నిలిచేందుకు కృషి చేశారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘంలో జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయి అధ్యక్షుడిగా ఎన్నికై ఎన్నో సేవలు అందించారు.సీతారామ కళ్యాణం కమిటీలో పనిచేస్తూ విశిష్టమైన సేవలు అందించారు. కర్నూల్ నగరంలోని రాజవిహార్ సెంటర్లో స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ కోసం ఎంతో కృషి చేశారు,ఇలా ఎన్నో సేవలు మరియు కురువ సంఘానికి,సమాజానికి విశేషమైన సేవలు మరపురానివని కొని

 

యాడారు. సేవలు గురించి మాట్లాడారు.

అనంతరం కురువ కులస్థులపై జరుగుతున్న దాడులపై మాట్లాడుతూ జిల్లాలో ఎంపి బస్తిపాటి నాగరాజు గారు గెలుపొందిన తరువాత కురువల కష్టాలు ఏక్కువైనాయని ముక్తకంఠంతో హోరెత్తించారు. పోన్నకల్లు, ఎర్రకోట,సంగాల,ఆదోని లాంటి సంఘటనలు ఏన్నో ఉన్నాయి. కనీసం పరామర్శకు నోచుకోని పరిస్థితి ఉంది. రాజకీయాల్లో కురువలను అణగదొక్కడములో భాగంగా దాడులు కోంతమంది చేయిస్తున్నారు. అలాంటి వారిని వచ్చే స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, ఎంపిపి, ఎంపిటిసి,జడ్పీటీసీ,సర్పంచ్ ఏన్నికలలో తగిన బుద్ధి చెబుతామని తేలిపారు.

ఈ కార్యక్రమంలో బి. సి. ఎస్. సి. మైనారిటీ నాయకులు శేషపణి, మాట్లాడుతూ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి

గా ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 44 శాతం రిజర్వేషన్ కల్పిం

చారు. ప్రస్తుత ప్రభుత్వం అప్పటికి ఇప్పటికీ జనాభా పెరిగిన 34 శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడం దారుణమని చెప్పారు.సిపిఐ జగన్నాథం, సందడి సుధాకర్,సిపిఎం వెంకటరాముడు,పాలసుంకన్న, ధనుంజయ, కె. సి.నాగన్న, తిరుపాల్, రాయలసీమ విద్యార్థి పోరాట కమిటీ అధ్యక్షులు రవికుమార్ సుంకన్న, జిల్లా మహిళా సంఘం ఆద్యక్షురాలు శ్రీలీల,శ్రీశైలం సత్రం కార్యదర్శి వెంకటేశ్వర్లు,నగర అధ్యక్షులు తౌడు శ్రీనివాసులు కార్యదర్శి బి. రామకృష్ణ,వెం

కటేశ్వర్లు రేమట మాజీ సర్పంచ్ వెంకన్న శివప్రసాద్చి,చిరంజీవి,లింగన్న, హుస్సేన్, జిల్లా లోని వివిధ మండలాల అధ్యక్షులు రాంగోపాలు, నాగరాజు, అంపయ్య, కే. టి. ఉరుకుందు, శివ రాముడు,వేల్పనూరు శివ, చిన్న, కె. హరిదాసు,రవీంద్ర బాబు, సింధు నాగేశ్వరరావు,వెంకటేశ్వర్లు, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS