
ఏపీలో భగ్గుమన్న ఎండలు.. 3-6 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు
కర్నూలు : ఏపీలో శనివారం ఎండలు భగ్గుమన్నాయి. సాధారణం కంటే 3-6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నెల్లూరులో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. వర్షాలు లేక ఎండుతున్న పంటలకు ఈ వేడి మరింత నష్టం కలిగిస్తుందని పేర్కొంది. ఆదివారం కూడా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, అక్కడక్కడ స్వల్ప వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.
Was this helpful?
Thanks for your feedback!

