అలరించిన  కృష్ణాష్టమి వేడుకలు

అలరించిన కృష్ణాష్టమి వేడుకలు

ఆలూరు : హోళగుంద మండలంలో  గోవిందుడు అందరివాడేలే అంటూ గోపికమ్మలు తమ చిలిపి చేష్టలతో గోపాలుడ్ని ఆటపట్టించిన వైనంతో శ్రీ కృష్ణుని జన్మాష్టమి వేడుకలు మంగళవారం మండల పరిధిలోని గెజ్జేహల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. చిన్నారులు చిన్ని కృష్ణులుగా,గోపికలుగా అలంకరించుకుని ఆకట్టుకున్నారు. కృష్ణుని జననం ప్రపంచానికి మేలు చేకూర్చిందని నమ్మకమనీ స్థానికులు తెలిపారు. కృష్ణతత్వంలోనే పరమార్థం ఉందని విశ్వాసం అందరిలో కలుగుతుందన్నారు. గితోపాదేశం ద్వార ప్రపంచానికి మానవాళికి మనుగడకు మార్గదర్శకం ఇచ్చిన భగవంతుని సారాన్ని కృష్ణుని అవతారంలో కొలవడమే కాకుండా ద్వాపర యుగ శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు శ్రీ కృష్ణునుడు జన్మనిచడాని పురాణాలు చెబుతున్నాయని భక్తులు తెలిపారు. శ్రీ కృష్ణుని జన్మదినాన్ని జన్మాష్టమి అనే కాక గోకులాష్టమి అని  కూడా అంటారని అన్నారు. ఇలాంటి పవిత్రమైన రోజును మండల ప్రజలు తమ తమ ఇళ్లలోని చిన్నారులకు శ్రీకృష్ణుని,గోపికల వేషం వేసి,ఆ కృష్ణుని వేషంలో చిన్నారులు చిన్ని చిన్ని పాదాలతో అడుగులు పెడుతూ ఇళ్లలో తిరుగుతుంటే అచ్చం శ్రీ కృష్ణుడు తమ ఇంటికి వచ్చినట్లు ఆనందోత్సవంలో మునిగిపోయారని గ్రామస్తులు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!