అభివృద్దికి సహకరించండి మంత్రి నారాయణతో సవిత
అమవరతి : మంత్రి నారాయణతో సవిత పెనుకొండ నగర పంచాయతీలో పలు అభివృద్ధి పనులకు సహకరించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత కోరారు. గురువారం విజయవాడలోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో ఆయనను మంత్రి సవిత కలిసి…నగర పంచాయతీలో చేపట్టే అంశాలపై చర్చించారు.

నగర పంచాయతీలో సిబ్బందిని పెంచండి…సిబ్బంది కొరత కారణంగా పెనుకొండ నగర పంచాయతీలో పారిశుధ్యం నిర్వహణ, నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ దృష్టికి మంత్రి సవిత తీసుకొచ్చారు. పెనుకొండ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో 61 మంది కార్మికులు సేవలు అందిందించే వారని మంత్రి సవిత తెలిపారు. నగర పంచాయతీగా ఆవిర్భవించిన తరవాత 19 మంది రెగ్యులర్ పీహెచ్సీ సిబ్బందిని పంచాయతీ సేవలకు అప్షన్ ఇవ్వడంతో వారు రిలీవయ్యారన్నారు.

ప్రస్తుతం కేవలం 44 మంది కార్మికులు మాత్రమే నగర పంచాయతీలో సేవలందిస్తున్నారు. దీనివల్ల పారిశుధ్య నిర్వహణతో పాటు తాగునీటి సరఫరాలో తీవ్ర ఆటంకం కలుగుతోందన్నారు. దీనిపై ప్రజాప్రతినిధుల నుంచి ఎన్నో ఫిర్యాదు అందుతున్నాయన్నారు. అవసరమైన మేరకు సిబ్బందిని నియామకానికి అనుమతివ్వాలని మంత్రి నారాయణను మంత్రి సవిత కోరారు. మంత్రి సవిత తెలిపిన సమస్యలపై నారాయణ సానుకూలంగా స్పందించారు. పెనుకొండలో సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.