ఒక రోజు ముందుగానే అవ్వ తాతల ముఖంలో ఆనందం
*జోరువానలో సైతం ఎన్టీఆర్ భరోసా ఫించన్ పంపిణీ కార్యక్రమం
హోళగుంద,న్యూస్,వెలుగు:మండల కేంద్రంలో శనివారం మేజర్ గ్రామ పంచాయితీల్లో ఉదయం 5 గంటలకే ఎన్టీఅర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమాన్ని ఆదోని డీఎల్డిఓ నాగేశ్వర రావు పరిశీలించారు.అనంతరం కూటమి నాయకులు,సచివాలయం సిబ్బందితో కలిసి ఫించన్ దారుల ఇంటింటికి వెళ్లి ఫించన్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే ఫించన్ పంపిణీ చేయాలని ప్రభుత్వ నిర్ణయించి అందరినీ అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ఆగస్టు 31న ఫించన్ తీసుకోని వారికి సెప్టెంబర్ 2న ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ముందస్తు కార్యాచరణ అమలు చేయడం వలన పెన్షన్ దారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని,రాష్ట్ర ప్రజలకు సామాజిక న్యాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు.ఈ కార్యక్రమం కూటమి నాయకులు పాల్గొన్నారు.