వరి సాగుని పరిశీలించిన  శాస్త్రవేత్త నాగరాజు

వరి సాగుని పరిశీలించిన శాస్త్రవేత్త నాగరాజు

న్యూస్ వెలుగు ఒంటిమిట్ట : రైతు తన పొలానికి తనే శాస్త్రవేత్తని మండల కేంద్రమైన సిద్ధవటం గ్రామంలోని రమేష్ అనే రైతు పొలంలో ఆదివారం వ్యవసాయక అసిస్టెంట్ డైరెక్టర్ ఎం నాగరాజు పరిశీలించారు.  ఆయన ఆ గ్రామంలోని రైతు రమేష్ పొలంలో క్షేత్రస్థాయి పర్యటన చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రైతుతో మాట్లాడుతూ ముఖ్యంగా వరి పంట సాగుకు యూరియా శాతం తగ్గించి ఎకరాకు పొటాషియం 20 కేజీ ల నుండి 30 కేజీల వరకు వేయవచ్చని తెలియజేశారు. వరి పంట రైతులు తమ పొలాల్లో తామే శాస్త్రవేత్తలుగా భావించి చిన్న చిన్న చిట్కాలు పాటించాలని ఎకరాకు జింకు సల్ఫేట్ 20 కేజీల చొప్పున వాడొచ్చన్నారు. రైతులు వరి పంటలు సాగు చేసేటప్పుడు విత్తులు విశాలంగా నాటినట్లయితే పంటలకు దోమపోటు నివారించవచ్చని అధిక దిగుబడులు సాధించవచని తెలిపారు.

 

 

 

 

 

 

 

.

Author

Was this helpful?

Thanks for your feedback!