
ఆయన చేసిన సేవలు మరువలేనివి : ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి
న్యూస్ వెలుగు ఒంటిమిట్ట: సెప్టెంబర్ 2 వ తేదీ సోమవారం దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కడప జిల్లా రాజంపేట నియోజక వర్గానికి చెందిన సిద్ధవటం, నందలూరు, ఒంటిమిట్ట, వీరబల్లి, సుండుపల్లె మండలాల వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా నిర్వహించాలని నియోజకవర్గ శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం నియోజకవర్గ ప్రజలతో మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల కోసమే పాటు పడ్డారని , ఆయన ప్రవేశ పెట్టిన ఎన్నో పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని వారు అన్నారు. ఆ మహానేతను స్మరించుకుంటూ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైయస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహాల వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపినచ్చారు.
Written by
Journalist Balu swamy