గ్రామాల అభివృద్ధి పై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి
హోళగుంద, న్యూస్,వెలుగు: మండల కేంద్రంలో సోమవారం జనసేన పార్టీ నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలూరు తాలూకా జనసేన పార్టీ ఇన్చార్జ్ తెర్నేకల్ వెంకప్ప ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ముందుగా పార్టీ నాయకులతో కలిసి డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ కట్ చేసి టపాసులు కాల్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి పై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని చెప్పారు.అలాగే మండలంలో నెలకొన్న సమస్యలను జనసేన ఇంచార్జీ తెర్నేకల్ వెంకప్ప దృష్టికి తీసుకెళ్లారు.ఇందుకు స్పందించిన ఆయన సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.అలాగే రూ.10 వేల స్వంత ఖర్చుతో 20 మందితో క్రియాశీల సభ్యత్వ నమోదు చేసిన మంజునాథ్ ను శాలువ పూలమాలలతో సత్కరించారు. జన్మదిన వేడుకలకు రూ.10 వేల నగదును అందజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిదానంద, మండల అధ్యక్షులు ప్రసాద్,జనసేన మండల కన్వీనర్ అశోక్,మండల ప్రధాన కార్యదర్శి చిన్న,వీరేష్,కూటమి పార్టీ నాయకులు తోక వెంకటేష్, ఈరప్ప,రామ,హుసేన్ పీర,పిరన్న,జాకీర్,మోహి, మెకానిక్ గంగా,శీను,వీరేష్,మంజునాథ,వెంకటేష్,జలాల్,రాజశేఖర్,జంగల ఈరన్న, గేజ్జహాలి రామలింగ,నబీ రసూల్,శ్రీ రంగ,హనుమంతు తదితరులు పాల్గొన్నారు.