మొక్కలు నాటి పచ్చదనం పెంపొదించాలి
పెద్దముడియం,న్యూస్ వెలుగు ; బుధవారం ఉదయం వనమహోత్సవం సందర్భంగా గుండ్లకుంట గురుకుల పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన జమ్మలమడుగు ఏ.పి.డి రామలింగేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకం చేపట్టి పచ్చదనం పెంపొందించాలని , అలాగే పౌష్ఠికాహారం కొరకు పండ్ల మొక్కలు, మునగ మొక్కలు విరివిగా నాటి సంరక్షించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ వెంకట రమణయ్య , ప్రిన్సిపల్ ప్రభావతి , ఏ పీ ఓ వెంకట సుబ్బయ్య , ఈసీ శ్రీరాములు, ప్లాంటేషన్ సూపర్వైజర్ లక్షుమయ్య ,టిఎ లు కుమార్ , మల్లేశ్వర రెడ్డి , దస్తగిరి రెడ్డి , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!