
అథ్లెట్ దీప్తి ని సత్కరించిన ముఖ్యమంత్రి
తెలంగాణ: ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ పారాలింపిక్స్ 2024లో పతకం సాధించిన తెలంగాణపారా అథ్లెట్స్, క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేలా, వారికి అవసరమైన ప్రోత్సాహం అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరామ్ ఎమ్మెల్యే నాగరాజు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్) చైర్మన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.