
వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ ; డివైఎఫ్ఐ
జమ్మలమడుగు, న్యూస్ వెలుగు ;విజయవాడలో వరద బీభత్సానికి సర్వం కోల్పోయిన వరద బాధితుల సహాయార్థం కోసం మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరి విరాళాలు ఇచ్చి సహాయం చేయాలని డివైఎఫ్ఐ మాజీ నాయకులు వీరణాల.శివ నారాయణ తెలిపారు. వరద బాధితుల సహాయార్థం కోసం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పట్టణంలో మార్కెట్ ఏరియాలో ప్రజల వద్ద విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మాజీ నాయకులు శివ నారాయణ మాట్లాడుతూ ప్రకృతి విపత్తు కారణంగా విజయవాడ నగరం మొత్తం వరదలతో భీభత్సం జరిగిందని అన్నారు.ఇది చాలా బాధాకరమైన సంఘటన అని అందరిని కలచివేసింది అన్నారు.వరద బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల.శివకుమార్ మాట్లాడుతూ విజయవాడ వరదలను కేంద్రం జాతీయ విపట్టులాగ ప్రకటించాలని అన్నారు.వరదల కారణంగా ఇప్పటికే అపార నష్టం జరిగింది అన్నారు.గత వారం రోజుల నుండి ప్రజలకు వరద బాధితులకు సహాయ కార్యక్రమాల లో డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వం పాల్గొని సేవలు అందిస్తున్నారు అన్నారు. పోరాటాలలోని కాదు సేవలను ముందుంటామని డివైఎఫ్ఐ నాయకత్వం నిరూపించింది అన్నారు. విరాళాల ఇచ్చిన అందరికీ డివైఎఫ్ఐ యువజన సంఘం గా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎల్లయ్య జిల్లా కమిటీ సభ్యులు ప్రసాద్ పట్టణ నాయకులు సురేంద్ర కృష్ణారెడ్డ, మోహన్,ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం నాయకులు పల్లా లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist