ఘనంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు జన్మదిన వేడుకలు

ఘనంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు జన్మదిన వేడుకలు

కడప,న్యూస్ వెలుగు ; కడప నగరం స్థానిక 13 వ డివిజన్ బృందావన్ కాలనీలో ఆర్ఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు రెడ్డప్ప  శ్రీనివాసుల రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రెడ్డప్ప  శ్రీనివాస్ రెడ్డి నిజాయితీకి నిలువెత్తు రూపం అని కార్యకర్తలకు తోడునీడగా ఉంటూ ఎన్నికలు ముందు గాని ఎన్నికలు తర్వాత గాని కార్యకర్తలకు, నాయకులకు దైర్యం నింపిన నాయకుడు అని తెలిపారు. కడప ను అన్నివిధాలుగా అభివృద్ధి చేసే దమ్ము ఉన్న నాయకుడు అని తెలిపారు. కడప చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ప్రత్యర్థులకు చెమటలు పట్టించేలా ఎన్నికల సందర్భంగా దీటైనా సమాధానం చెప్పి గెలుపుకి కీలక పాత్ర వహించారని తెలిపారు. భవిష్యత్తులో కడప కార్పొరేషన్ శ్రీనివాస్ రెడ్డి  నాయకత్వం లోనే గెలుపు సాధ్యమవుతుందని కొనియాడారు .శ్రీనివాసులు రెడ్డి  మరి ఇన్ని పుట్టినరోజు లు జరుపుకోవాలని ఆకాంక్షించారు . ఈ కార్యక్రమం లో ఆర్ ఎస్ యు జిల్లా అధ్యక్షులు ప్రశాంత్, కార్యదర్శి చెన్నకేశవరెడ్డి, టీడీపీ నాయకుడు మదీనా, వీరబ్రహ్మం , కరీముల్లా, రాహుల్, స్థానిక నాయకత్వం పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!