శోభాయమానంగా వినాయక నిమజ్జన వేడుకలు
● బైబై గణేశా అంటూ చిన్నారులు నినాదాలు
● డప్పువాయిద్యాలతో హోరెత్తిన నందికోలు ఆడిస్తూ గణేష్ మహరాజ్ కి జై హొళగుంద…రంగులు చెల్లుకున్న చిన్నారులు, యువత
● నిమర్జన సందర్భంగా డి.ఎస్.పి విజయరాజ సీఐ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు
హోళగుంద, న్యూస్ వెలుగు:విఘ్నాలను తొలగించే విగ్నే శ్వరడీ నిమర్జన వేడుకలు మండలంలో శోభాయమానంగా సాగాయి.మండల కేంద్రంలో వివిధ మండపాలో వివిధ రూపాలలో కొలువైన గణపయ్య మూడు రోజుల పాటు భక్తుల విశేష పూజలు అందుకుని సోమవారం అమ్మ గంగమ్మ ఒడిలోకి చేరుకున్నాడు.అలాగే యువకులు ఇష్టదైవమైన గణేశ్ మహరాజ్ మండపాల వద్ద యువకులు సందడి చేశారు.మరియు డప్పువాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ….రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకున్నారు. వినాయక ప్రతిమలను నిమర్జనం చేసేందుకు వాహనాల పై ఎత్తు తుంటే బై బై గణేశా….. అంటూ నినాదాలు చేశారు. సాయంత్రం శోభా యాత్ర ప్రారంభం కాగానే హొళగుంద ప్రధాన రహదారులు జనసందడితో కిక్కిరిసిపోయాయి.ప్రధానంగా ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు నిర్వహించారు.
● గణేష్ నిమర్జన ఘాట్ల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు
మండల కేంద్రంలో సోమవారం గణేష్ నిమర్జన కార్యక్రమంలో భాగంగా ఎలెల్సి దిగువ కాలువ వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశ్యంతో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చలువాది రంగమ్మ ఆధ్వర్యంలో తనయుడు పంపాపతి,కార్యదర్శి రాజశేఖర్ బారి గేట్లు,ఫోక్స్ లైట్లు,త్రాగునీటిని ఏర్పాటు చేశారు.అలాగే ఉత్సవ కమిటీ సభ్యులు నిమర్జన క్షణంలో తమ తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని,ఎలెల్సి గట్టు వద్ద ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రమాదాలకు దారి తీస్తుందని,కావున ప్రతి ఒక్కరూ గణేష్ నిమర్జన సమయంలో ఎటువంటి అపశ్రుతి జరగకుండా జాగ్రత్తగా ఉండాలని మైక్ ద్వారా భక్తులకు విన్నపించారు. ఎస్సై బాల నరసింహులు ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీస్ బందోబస్తు ప్రశాంతంగా గణేష్ నిమర్జనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజా పంపనగౌడ్ టిడిపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య దుర్గయ్య హోలగుందబస్టాండ్ లో గణేష్ నిమర్జనానికి వెళుతున్న గణనాథులు స్వాగతం సుస్వాగతం చెప్తూ ముందుకు సాగించారు మహిళలు కలశాలతో చిన్నారులు పెద్దలు కలిసికట్టుగా నిర్వహించారు