దెబ్బతిన్న పంటలు పరిశీలన

 దెబ్బతిన్న పంటలు పరిశీలన

హోళగుంద, న్యూస్, వెలుగు:మండల కేంద్రంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పత్తి,మిరప పంటలను మంగళవారం ఆలూరు వ్యవసాయ సంచాలకులు డాక్టర్ సునీత,కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్ర,మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోకదళ్ పరిశీలించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పత్తిలో అధిక వర్షాలకు బ్యాక్టీరియా,శిలీంద్రాలు వలన కాయకుళ్ళు తెగులు ఆశించి కాయలు నల్లగా మారి కుళ్లి పోతున్నాయని తెలిపారు.ఇందుకు పలు రకాల మందులను స్ప్రే చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు,కూటమి పార్టీ నాయకులు,రైతులు ఏ ఈ ఓ విరుపాక్షి వీఆర్వో నాగరాజా తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!