రాజకీయాలకు ఆయనే స్ఫూర్తి: శివకుమార్
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్,మాజీ డివైఎఫ్ఐ జాతీయ నాయకులు సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికే కాకుండా భారతదేశంలోని లౌకిక ప్రజాస్వామ్య పురోగమనాలకు కూడా తీరని లోటు. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల.శివకుమార్ సంతాపం తెలియజేశారు.శివకుమార్ మాట్లాడుతూ ఏచూరి మన తెలుగువాడని విద్యార్థి,యువజన ఉద్యమంలో పాల్గొని జాతీయ స్థాయి కార్యదర్శిగా ఎదిగాడని అన్నారు.ఆయన పోరాటాలు స్ఫూర్తి దాయకం అన్నారు.ఎమర్జెన్సీ భయాందోళనలను నిర్భయంగా ఎదుర్కొన్న విప్లవ విద్యార్థి నుంచి దేశమంతటా గౌరవించే ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడి వరకు కామ్రేడ్ ఏచూరి జీవితం భారత రాజకీయాల్లో ప్రకాశవంతమైన అధ్యాయాలలో ఒకటి.కామ్రేడ్ ఆర్గనైజర్, సోషలిస్ట్, పొలిటీషియన్. తనకు అప్పగించిన బహుముఖ బాధ్యతలన్నింటినీ అద్భుతంగా నిర్వహించారు.
రైతులు మరియు ప్రాథమిక ప్రజల విముక్తి కోసం తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసిన ఆయన సంఘ్ పరివార్, మతతత్వానికి వ్యతిరేకంగా సాగిన పోరులో సవాళ్ళను దీటుగా ఎదుర్కొన్నాడు.అనేక దశలలో, అతను జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే రాజకీయ ఎత్తుగడలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు.కడప ఉక్కు కోసం జాతీయ స్థాయిలో సైతం ఉద్యమాన్ని డిల్లి వేదికగా నిర్వహించాడు అని కడప కు వచ్చి కడప ఉక్కు ఉద్యమంలో పల్గొన్నడని,NRC ఉద్యమంలో కూడా కడప లు పల్గొన్నడని ఆయన స్మృతులు పంచుకున్నారు.కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి సీపీఎంకు ఎప్పటికీ పూడ్చలేని లోటు. వ్యక్తిగతంగా ఇది చాలా బాధాకరమైన సందర్భం.జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి.