
అమ్మ దయతో పునర్జన్మ
విజయవాడ, న్యూస్ వెలుగు; ఏపీ సెబ్ డిపార్ట్మెంట్ నందు ఫోర్ మెన్ (I వ గ్రేడ్) పదవీ విరమణ పొందిన గోకుల్ నగర్, వెంకటాపూర్, తిరుమల గిరి, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ వాస్తవ్యులైన బొర్రా నిరంజన్ కీ.శే బి. సోమయ్య ఇటీవల ట్రైన్ యక్సిడెంట్ కు గురై ప్రాణపాయ స్థితి నుండి మామూలు స్థితికి చేరుకున్నారు.
ఈ సందర్బంగా వీరు దయతోనే మామూలు స్థితికి రాగలిగామని, అమ్మవారికి దేవస్థానం నకు కుటుంబసభ్యులతో కలిసి విచ్చేసి ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు ని కలిసి, విషయం తెలిపి రూ.8,00,000/-ల చెక్కు ను అమ్మవారికి మొక్కుబడిగా శ్రీ అమ్మవారి ఆలయం స్వర్ణ తాపడం పనుల నిమిత్తం అందజేయగా, ఆలయ ఈవో వీరికి కనక దుర్గమ్మ అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులచే వేదాశీర్వచనం కల్పించి అమ్మవారి ప్రసాదములు, శేష వస్త్రం మరియు చిత్రపటం అందజేసి, అమ్మవారు వీరికి మంచి ఆరోగ్యం, ఆయుష్షు అందజేయాలని ప్రార్థించినట్లు తెలిపారు.