రాంపల్లిలో ఘనంగా జరిగిన ఎమ్మార్పీఎస్ఎస్ జెండావిష్కరణ
* హాజరైన ఎమ్మార్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బుగ్గ సంజయ్ మాదిగ
తుగ్గలి న్యూస్ వెలుగు: తుగ్గలి మండలంలోని రాంపల్లి గ్రామంలో గ్రామంలోని మాదిగ కులానికి చెందిన కాలనీ పెద్దల సమక్షంలో ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మార్పిఎస్ఎస్ జెండావిష్కరణను అంగరంగ వైభవంగా ఆవిష్కరణ భారీ ఊరేగింపుగా బయలుదేరి బాణ సంచాలతో ఉరిమే ఉత్సాహంతో కన్నుల పండుగల జెండావిష్కరణను చేశారు.ఈ జెండా ఆవిష్కరణ వేడుకలకు ఎమ్మార్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బుగ్గ సంజయ్ మాదిగ ముఖ్య అతిధిగా హాజరయ్యి జెండాను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా రాంపల్లి గ్రామంలో తిరునాంపల్లి వెంకటేష్, కడియాల సోమయ్య,మండగిరి రామాంజనేయులు,ఎముక రామకృష్ణ, చిట్యాల రంగనాయకులు,ఇనుము రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఆర్పిఎస్ఎస్ జెండాను రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుగ్గ సంజయ్ మాదిగ ఆవిష్కరణ చేపట్టడమైనది.ఈ సందర్భంగా బుంగ సంజయ్ మాదిగ మరియు టి.యం రమేష్ లు సంయుక్తంగా మాట్లాడుతూ మాదిగలు ఆర్థికంగా,రాజకీయంగా,సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు తమ పిల్లలను ఉన్నతంగా చదివించుకోవాలని తెలపడమైనది. అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగ మాట్లాడుతూ గ్రామాల్లో కుల వివక్షత అంటరానితనం నిర్మూలన కోసం పోలీస్ అండ్ రెవెన్యూ అధికారులు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలుపరిచి గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి వారిపై దాడులను దౌర్జన్యాలను హత్యలను, హత్యాచారాలను భూకుంభ కోణాలను నివారించి స్వేచ్ఛ సమానత్వం కొరకు అధికారులు కృషిచేసి కుల వివక్షత అంటరానితనం గ్రామాల్లో నిర్మూలించి దళితులకు అన్ని విధాలుగా పోలీస్ అండ్ రెవెన్యూ అధికారులు అండగా ఉండాలని డిమాండ్ చేయడమైనది.ఈ కార్యక్రమంలో కర్నూల్ జిల్లా అధ్యక్షులు గిడ్డయ్య మాదిగ,నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాదిగ, కర్నూలు జిల్లా కార్యదర్శి మద్దిలేటి మాదిగ,కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి రామాంజనేయులు మాదిగ,వెల్దుర్తి మండలం అధ్యక్షుడు మద్దిలేటి మాదిగ, మద్దికేర మండలం అధ్యక్షుడు ఆంజనేయులు మాదిగ,మద్దికేర మండలం గౌరవ అధ్యక్షుడు ప్రతాప్ మాదిగ,చిప్పగిరి మండలం అధ్యక్షుడు ప్రభాకర్ మాదిగ,తుగ్గలి మండల అధ్యక్షుడు రాజశేఖర్ మాదిగ,మండగిరి రామాంజినేయులు రంగస్వామి, దూదేకొండ రంగన్న,టి.వెంకటేష్, సోమయ్య,సి.రామాంజినేయులు, చిట్యాల రాముడు,రంగడు,రాఘవేంద్ర, వై. రాజా శేఖర్,శ్రీరాములు, జయరాముడు,పి.లాలప్ప,కె.లక్ష్మన్న, లక్ష్మి నారాయణ,రంగస్వామి, ఈశ్వరయ్య,ఇనుము రంగన్న,జయన్న, మహిళలు లలిత,మహేశ్వరీ,లక్ష్మి, చిట్టెమ్మ,లక్ష్మమ్మ,యశోద,రాములమ్మ మరియు యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.