ప్రజల సమస్యలపై డిప్యూటీ సీఎంగా స్పందించాలి
వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి ఉప్పలపాటి యోబు
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; రాష్ట్రంలో కానీ మరి ఎక్కడైనా ఎవరికి ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించడానికి మేమున్నది మా పార్టీ ఉన్నది అన్నటువంటి పవన్ గారు ఈరోజు ఎక్కడ ఉన్నారు. పవన్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఒక్కసారి అయినా మీరు పూర్తిగా పరిశీలించారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజుల నుండి రాష్ట్రంలో ఒక పరిణామం తర్వాత ఒక పరిణామం జరుగుతూ వస్తున్నది. ముఖ్యంగా వాటిలో స్టీల్ ప్లాంట్ ను ఎన్డీఏ గవర్నమెంట్ ప్రైవేటీకరణకుఅనుకూలంగా చర్యలు తీసుకుంటూ ఉంటే ఇప్పటికి కూడా మీరు స్పందించడం లేదు ఎందుకు డిప్యూటీ సీఎం ఏమయింది మీ గొంతుకు ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రపంచమంతా ఎదురుచూస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి తిరుమల దేవస్థానంలోని లడ్డు విషయమై గౌరవ ముఖ్యమంత్రి లడ్డులో కల్తీ జరిగిందని మాట్లాడడం జరిగినది? అలా ఎందుకు మాట్లాడారు ఏమి చేస్తున్నారో కూడా తెలియడం లేదు వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం గా ఉంటూ ప్రజలకు కావలసినటువంటి సమస్యలపై మీరు స్పందించడం లేదు . మీరు ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడం లేదు మీరు పార్టీలకతీతంగా పదవులకతీతంగా మీరు ఇప్పటికైనా నిజాయితీగా మాట్లాడాలి సిబిఐతో వెంటనేఎంక్వయిరీ జరిపించాలి లేనిపక్షంలో ప్రశ్నించడానికి పుట్టిన జనసేన పార్టీ జన సైనికులు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పకనే మీరు చెప్పినట్లు అవుతుంది కావున మీరు వెంటనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలి తిరుపతి లడ్డుపై ఉన్నటువంటి చెడు ప్రచారాన్ని అడ్డుకట్ట వేయాలి లేనిపక్షంలో కాల గమనంలో అన్ని పార్టీలు మాదిరిగానే మీ పార్టీ ఉండిపోతుంది. కావున మీరు ప్రశ్నిస్తారో లేక ప్రజల పక్షాన నిలబడతారో మీరే తెలుసుకోండి.