రాష్ట్ర ప్రజలకు మంచి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర ప్రజలకు మంచి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

* రాంపల్లి,కడమకుంట్ల గ్రామాలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలు.

తుగ్గలి న్యూస్ వెలుగు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందిస్తుందని టీడీపీ మండల అధ్యక్షులు ఆర్.తిరుపాల్ నాయుడు అన్నారు.రాంపల్లి గ్రామంలో సోమవారం రోజున పత్తికొండ నియోజకవర్గం శాసనసభ్యులు కేయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు రాంపల్లి గ్రామంలో టీడీపీ తుగ్గలి మండల అధ్యక్షులు ఆర్ తిరుపాల్ నాయుడు ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం సిబ్బంది మరియు టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్బంగా తుగ్గలి మండల టీడీపీ అధ్యక్షులు తిరుపాల్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో 100 రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంటుందన్నారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్దిదారులైన అవ్వతాతల పెన్షన్ 4000,వికలాంగుల పెన్షన్ 6000, రాష్ట్రంలోని లక్షలాదిమంది నిరు పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు, నిరుద్యోగులైన యువతకు బంగారు భవిష్యత్తుకు మెగా డీఎస్సీ,ప్రజల సొంత భూమి స్టిరాస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు,విజయవాడలోని వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయడంతో పాటు మరో సంక్షేమ పథకాలను అందించేందుకు మన ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.కేంద్రంలోను రాష్ట్రంలోను ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని ఈ ప్రభుత్వాలు ప్రజల కోసమే పని చేస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సచివాలయం అధికారులు పంచాయతీ కార్యదర్శి మనోహర్,ఇంజనీరింగ్ అసిస్టెంట్ సుమన్,వెటర్నరీ అసిస్టెంట్ రవితేజ, డిజిటల్ అసిస్టెంట్ భారతి,వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రతిమ,ఏ.ఎన్.ఎం రోజా, విలేజ్ సర్వేయర్ రాజేశ్వరి,గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్.హేమాద్రి నాయుడు, యర్రబాట్ల లక్ష్మన్న,రామాంజనేయులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.అదేవిధంగా సోమవారం రోజున మండల పరిధిలోని గల కడుమకుంట్ల గ్రామం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు,ఎమ్మెల్యే కె.యి శ్యాంబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పడి వందరోజుల సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ,ఈ వంద రోజుల్లో చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను,అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ శభాష్ పురం గ్రామ టిడిపి నాయకులు,అధికారులు గ్రామపంచాయతీలో చేపట్టారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ మరియు సచివాలయ సిబ్బంది శభాష్ పురం పంచాయతీ టీడీపీ నాయకులు తలారి శ్రీరాములు,గంగసాని ఆది నారాయణ,గంగసాని మోహన్, గుడిసెగుప్పరాళ్ల సోమశేఖర్ గౌడ్, గోరంట్ల హనుమంతు మరియు టిడిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!