నేడు తుగ్గలిలో స్వర్ణాంధ్ర-2047 సమీక్ష సమావేశం
తుగ్గలి న్యూస్ వెలుగు: మండల కేంద్రమైన తుగ్గలి నందు మంగళవారం రోజున స్వర్ణాంధ్ర-2047 పై మండల స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తుగ్గలి ఎంపీడీవో సావిత్రి తెలియజేశారు.ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మంగళవారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీడీవో కార్యాలయం నందు మండల ప్రత్యేక అధికారి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో స్వర్ణాంధ్ర-2047 సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలియజేశారు.కావున ఈ సమీక్ష సమావేశానికి మండల స్థాయి అధికారులు తమ ప్రగతి నివేదికలతో తప్పకుండా హాజరుకావాలని ఆమె తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!