
సంక్షేమ పాలన చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం
* హంద్రీనీవా నీటితో నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం
* త్వరలో ప్రతి ఇంటికి సూపర్ సిక్స్ పథకాలు వర్తింపు
తుగ్గలి, న్యూస్ వెలుగు: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పాలన అందించడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోనే సాధ్యమవుతుందని పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు తెలియజేశారు.మంగళవారం రోజున మండల కేంద్రమైన తుగ్గలి నందు స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద జరిగిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పత్తికొండ శాసనసభ్యులు కేఈ శాంబాబు హాజరయ్యారు.ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేఈ శాంబాబుకు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర,మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు బాణాసంచా పేలుస్తూ శాలువా కప్పి,పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు అధికారులు ఘనంగా స్వాగతం స్వాగతం పలికారు.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 100 రోజుల సంక్షేమ పాలనపై గ్రామ సభలో భాగంగా పలువురు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించారు. అనంతరం టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన తెలియజేశారు.పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు నాయకత్వంలో పత్తికొండ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన తెలియజేశారు. పత్తికొండ శాసనసభ్యులుగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలలలోనే పత్తికొండ నియోజకవర్గంలోని ప్రతి మండలానికి రెండు కోట్ల నిధులను మంజూరు చేసిన ఘనత ఎమ్మెల్యే శ్యాంబాబుకు చెందుతుందని ఆయన తెలియజేశారు. అనంతరం పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన తెలియజేశారు. ముందు చూపు ఉన్న నాయకున్ని ఎన్నుకోవడం వలన వరద సమస్యలను వేగంగా పరిష్కరించామని ఆయన తెలియజేశారు.హంద్రీనీవా జలాల ద్వారా 68 చెరువులకు నీటినందించి, పత్తికొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆయన తెలియజేశారు.తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకులకు,కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు. నియోజకవర్గం నందు ప్రతి మండలంలో కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ ద్వారా మండలంలో గల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలియజేశారు.ప్రజలందరూ కుల వివక్షతను విడిచి సోదర భావంతో జీవించాలని ఆయన తెలియజేశారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి నియోజకవర్గ పరిధిలోని ప్రాజెక్టుల సమస్యలను తెలియజేశామని,త్వరితగతిన పాత ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త వాటికి శ్రీకారం చుడతామని ఆయన తెలియజేశారు.పత్తికొండ నియోజకవర్గంలో త్వరలో జాబ్ మేళాను నిర్వహించి, నారా లోకేష్ ఇచ్చిన యువగలం హామీలను నెరవేరుస్తామని ఆయన తెలియజేశారు. గత 100 రోజు పాలనలో పెన్షన్ పెంపు, డీఎస్సీ నోటిఫికేషన్,అన్నా క్యాంటీన్లు ప్రారంభం,ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, స్థానిక సంస్థలకు నిధులను విడుదల చేయడం వంటి సంక్షేమ పథకాలను అందించిందని ఆయన తెలియజేశారు. అదేవిధంగా 100 రోజులలో ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి, ఎంపీడీవో సావిత్రి,తహసిల్దార్ నాగరాజు,మండల విద్యాధికారి రామ వెంకటేశ్వర్లు,హౌసింగ్ డిఈ విజయ్ కుమార్,మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్,పశువైద్యాధికారిని ప్రణీత,ఏపీఎం రాధాకృష్ణ,ఏపీవో రామకృష్ణ,ఈఓఆర్డి గోపాల్,ఎంపీపీ ఎర్ర నాగప్ప, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు,మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు, ఉపాధ్యక్షుడు వెంకటరాముడు చౌదరి,టిడిపి నాయకులు మనోహర్ చౌదరి,వెంకటస్వామి,కొత్తూరు శివరాముడు,చంద్రశేఖర్ యాదవ్, తిమ్మయ్య చౌదరి,బర్మా వీరేష్,మధు, లింగయ్య,తెలుగు యువత మండల అధ్యక్షుడు సత్య ప్రకాష్,మిద్దె రవి,మిద్దె వెంకటేశ్వర్లు, మారెళ్ళ ధ్రువ మూర్తి, ఉప్పర్ల పల్లె నీలా మనోహర్,శ్రీనివాసులు గౌడ్,పగిడిరాయి ఈశ్వర్ రెడ్డి,బాలన్న, సర్పంచ్ ఓబులేసు,కడమకుంట్ల మాజీ సర్పంచ్ పకీరప్ప,తదితర మండల టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.