ప్రజా సంక్షేమమే చంద్రబాబు నాయుడు ధ్యేయం

ప్రజా సంక్షేమమే చంద్రబాబు నాయుడు ధ్యేయం

టిడిపి నాయకులు పాటిల్ ఈశ్వర్ రెడ్డి

* పగిడిరాయి,పగిడిరాయి కొత్తూరు, బోల్లవాని పల్లె గ్రామాలలో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహణ.

తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి:ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమని పగిడిరాయి నీటి సంఘం మాజీ చైర్మన్ పాటిల్ ఈశ్వర్ రెడ్డి తెలియజేశారు.గురువారం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పత్తికొండ శాసనసభ్యులు కే.ఈ శాంబాబు ఆదేశాల మేరకు మండల పరిధిలోని గల పగిడిరాయి,పగిడిరాయి కొత్తూరు, బోల్లవాని పల్లె గ్రామాలలో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమాన్ని టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించగా గ్రామ సచివాలయం సిబ్బంది మరియు టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్బంగా గ్రామ టిడిపి నాయకులు పాటిల్ ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 100 రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంటుందన్నారు.రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్దిదారులైన అవ్వ తాతల పెన్షన్ 4000,వికలాంగుల పెన్షన్ 6000, రాష్ట్రంలోని లక్షలాదిమంది నిరు పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు, నిరుద్యోగులైన యువతకు బంగారు భవిష్యత్తుకు మెగా డీఎస్సీ,ప్రజల సొంత భూమి స్టిరాస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు,విజయవాడ లోని వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయడంతో పాటు మరో సంక్షేమ పథకాలను అందించేందుకు మన ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.కేంద్రంలోను మరియు రాష్ట్రంలోను ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని ఈ ప్రభుత్వాలు ప్రజల కోసమే పని చేస్తున్నాయని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వంద రోజులుగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల గురించి గ్రామ ప్రజలకు వారు వివరించి,ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తిరుపాల్ నాయుడు,ఉపాధ్యక్షుడు వెంకటరాముల చౌదరి,ఫీల్డ్ అసిస్టెంట్ మద్దికేర రాము,రైతు సంఘం నాయకులు కొత్తూరు చక్రపాణి,మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ గుండమయ్య,ఎర్ర మీసాల సుంకన్న,నక్కల రమేష్,బూత్ కన్వీనర్ నాగార్జున,జే.చంద్రమోహన్, డీలర్ రంగస్వామి,లాలప్ప,గ్రామ అధికారులు వీఆర్వో రంగన్న,డిజిటల్ అసిస్టెంట్ గోపాల్ నాయక్,వెటర్నరీ అసిస్టెంట్ సోమ సుందర్,అగ్రికల్చర్ అసిస్టెంట్ నాగార్జున,మహిళా పోలీస్ జ్యోతిలక్ష్మి,ఏఎన్ఎం అంజలి,విలేజ్ సర్వేయర్ వేణు గోపాల్,ఇంజనీరింగ్ అసిస్టెంట్ హరిబాబు నాయక్ తదితర టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!