
చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తాం
హొళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో గురువారం స్థానిక మడివాళ మాచయ్య స్వామి గుడిలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం సాయుధ రైతాంగ పోరాటంలో తన వంతు పాత్ర పోషించిన వీర వనిత చాకలి ఐలమ్మ ఈతరం మనం చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. ఆమె జీవిత చరిత్ర భావితరాలకు తెలియజేయాలని చెప్పారు.తన పోరాట పటిమతో రజకులకు ఘన కీర్తిని సంపాదించి పెట్టిన మన రజక వీర వనిత చాకలి ఐలమ్మ చరిత్ర ఆంధ్ర తెలంగాణలకే కాక యావత్ భారతదేశంలో ఉన్న రజకులకు గర్వకారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1919 సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లాలో రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో వీర వనిత చాకలి ఐలమ్మ జన్మించిన్నారు.ఆమె ఆశయాలను మనమందరం కూడా కొనసాగించాలని వారన్నారు.ఈ కార్యక్రమంలో చాకలి సంఘం నాయకులు మంగయ్య,లక్ష్మన్న,నాగరాజు,మల్లికార్జున,మల్లి,రవి,రాజా,రామకృష్ణ,హనుమేష్,నాగప్ప తదితరులు పాల్గొన్నారు.


 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda