ప్రజల మన్ననలు పొందిన కూటమి ప్రభుత్వం
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలో గురువారం గజ్జెహళ్లి, వందవాగలి గ్రామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.ఇందుల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులో ప్రారంభించిన సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించి,కరపత్రాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రీ సర్వే తహసీల్దార్ ముకుంద రావు,పంచాయితీ కార్యదర్శి రంగ స్వామి, వెటర్నరీ డాక్టర్ సోమశేఖర్ గౌడ,విఆర్ఓ ప్రహ్లాద,గజ్జెహళ్లి సర్పంచ్ తనయుడు గిరిమల్లప్ప, వందవాగలి సర్పంచ్ భర్త శేషప్ప,పంపా రెడ్డి,యువ నాయకులు మధుసూదన్ రెడ్డి,వైస్ సర్పంచ్ అశోక్,పంచాయతీ సెక్రటరీ రంగస్వామి,వెల్ఫేర్ అసిస్టెంట్ హైమవతి,అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉత్తమ కుమార్,దాసరి రామ,పాఠశాల కమిటీ చైర్మన్ శేషప్ప,పూజారి రామలింగ,రంగప్ప,బి కె పంపాపతి,నబీరసూల్,నాగప్ప,ఒమయ్యా,రామలింగ,కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.