సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి

సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి

ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు;  వ్యాపారస్తులు తప్పనిసరిగా తమ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే జరిగే దొంగతనాలను నివారించవచ్చని గురువారం సాయంత్రం మండల కేంద్రమైన ఒంటిమిట్ట బస్టాండ్ లో ఉన్న పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన దుకాణదారుల సమావేశంలో ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణంరాజు నాయక్ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన వ్యాపారస్తులతో మాట్లాడుతూ జరిగే పరిణామాల దృష్ట్యా ఆలోచిస్తే ఒంటిమిట్ట మండలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ముద్దాయిలను పట్టుకునేందుకు, సాక్షాదారాలను సేకరించేందుకు సీసీ కెమెరాలు పోలీసులకు అత్యంత ఆధారంగా నిలుస్తాయని వేగవంతంగా ముద్దాయిలను పట్టుకోవచ్చని దొంగతనాలు నివారించవచ్చన్నారు. కావున వ్యాపారస్తులు పోలీసులకు సహకరించి డబ్బు ఖర్చైనప్పటికీ సీసీ కెమెరాల వల్ల ఎంతో ఉపయోగ ఉంటుందని సీసీ కెమెరాలు వ్యాపారస్తులు దుకాణాల వద్ద అమర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అధునాతన సీసీ కెమెరాలు మార్కెట్లోకి లభ్యమయ్యాయని దొంగతనానికి వచ్చిన దొంగలు దుకాణం ద్వారాలు తీసేందుకు ప్రయత్నించినప్పుడు సైరన్ మోగుతుందని ఆ విధంగా తమ సెల్లులో పొందుపరచుకోవచ్చన్నారు. అంతేకాకుండా రాత్రి వేళల్లో సైతం అప్పుడప్పుడు వ్యాపారస్తులు తమ దుకాణాల వద్ద తనిఖీ చేసుకుంటూ ఉండాలన్నారు. అవసరమైతే వ్యాపారస్తులందరూ కలుసుకుని వాచ్మెన్లను ఏర్పాటు చేసుకున్నట్లయితే దొంగతనాలు జరగవని ఆయన అభిప్రాయపడ్డాడు. జరిగిన దొంగతనాలన్నీ ఏ విధంగా జరిగాయో వాటిని కూడా పరిశీలిస్తున్నామని ముద్దాయిలు ఎప్పటికీ తప్పించుకోలేరని తప్పకుండా శిక్ష పడుతుందని వ్యాపారస్తులు ఎటువంటి ఆందోళనలకు గురి కావద్దని ఈ సందర్భంగా ఆయన సమావేశంలో వ్యాపారస్తులకు ధైర్యం చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక పోలీసు సిబ్బంది వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!