అమరావతి : 

వరద బాధితుల సహాయ నిధికి విజయనగరానికి చెందిన లెండి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వైస్ ఛైర్మన్ పి.శ్రీనివాసరావు రూ.5 లక్షలు, గుంటూరుకు చెందిన తరుణి అసోసియేట్స్ ప్రతినిధులు రూ.5 లక్షలు, మంగళగిరికి చెందిన శిందే లక్ష్మయ్య మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు రూ.2 లక్షలు, గుంటూరుకు చెందిన అవినాష్ ఏజెన్సీస్ యాజమాన్యం రూ.2 లక్షలు, గన్నవరంకు చెందిన ఎంకే గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ నిర్వాహకులు రూ.1లక్ష, ఆదోనికి చెందిన జి.కృష్ణమ్మ రూ.1లక్ష, గుంటూరుకు చెందిన వడ్లమూడి సోమయ్య రూ.60,635, మంగళగిరి పెదవడ్లపూడికి చెందిన లూథరన్ చర్చ్ నిర్వాహకులు రూ.30వేలు, కుప్పంకు చెందిన పి.శివ కార్తీక్, పి.మురుగన్ రూ.20వేలు అందజేశారు. దాతలందరూ హృదయపూర్వక కృతజ్ఞతలు.
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			
				
				
				Thanks for your feedback!