ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; శనివారం మధ్యాహ్నం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి మురళీకృష్ణ కర్నూల్ నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబుని కలిసి కర్నూల్ నగరము సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా కర్నూలు నగరములో ఉన్న అన్ని పార్కులు శుభ్రం చేయించి, పార్కుల్లో చిన్నపిల్లలు ఆడుకొవడానికి ఆట వస్తువులు, పెద్దలకు అవేర్నెస్ ప్రోగ్రాములు, వాకింగ్ ట్రాకులు, పార్కులకు వాచ్మెన్లను నియమించి వృద్ధులు రోడ్లమీద వాకింగ్ చేయకుండా వారికి ప్రత్యేక ప్లాట్ ఫామ్ లు ఏర్పాటు చేయవలసిందిగా మురళీకృష్ణ కోరారు. అలాగే కర్నూల్ నగర పరిధి నందలి ప్రభుత్వ స్థలాలలో హద్దులకు ఫెన్సింగ్ తీగలు లేదా కాంపౌండ్ గోడలు నిర్మించి ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలని, కర్నూలు కార్పొరేషన్ పరిదినందు గల వెంకటరమణ కాలనీ ప్రేమనగర్ కాలనీ రోడ్ నెంబర్ 3 మరియు 4 లైన్ల నందు క్లీనింగ్, వీధిలైట్లు మరియు చెట్లను నాటించి వాటికి క్రమం తప్పకుండా ఉద్యానవన శాఖ వారిచే ఆ చెట్లను సమగ్రంగా పరిరక్షించవలెనని మురళీకృష్ణ కమిషనర్ రవీంద్ర బాబుని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అనంతరత్నం ఈ లాజరస్ ఎస్ ప్రమీల ఏ వెంకట సుజాత కరుణమ్మ పాల్గొన్నారు.